4 September, 2026 | 11:23 AM

బేకరీలో అగ్నిప్రమాదం

04-09-2026 | 10:20am

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్04(విజయక్రాంతి): నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్(RTC Workshop) సమీపంలో శుక్రవారం ఉదయం విశ్వ  బేకరీలో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. దట్టమైన పగలు రావడం గమనించి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో చేరుకున్న ఫైర్ ఇంజన్  మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. సుమారు గంటపాటు ఫైర్  సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేయగలిగారు. అక్కడికి చేరుకున్న ఫైర్ అధికారులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.