4 September, 2026 | 10:21 AM

అంతరిక్షంలో భారత్ మరో చరిత్ర.. GSLV-F17 ప్రయోగం సక్సెస్

04-09-2026 | 09:21am

శ్రీహరికోట: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట(Sriharikota) అంతరిక్ష కేంద్రంనుండి ఇస్రోకు(ISRO) చెందిన భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ను మోసుకెళ్తున్న GSLV F17 రాకెట్(GSLV F17 Rocket) విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ రాకెట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) నుండి  శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు (IST) నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే, EOS-05 ఉపగ్రహం దాని నిర్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టబడింది.

"అధునాతన భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 (జియో-ఇమేజింగ్ శాటిలైట్)ను GSLV-F17 వాహక నౌక విజయవంతంగా, కచ్చితంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిందని ప్రకటించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను." అని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్(ISRO Chief Dr. V. Narayanan) అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, నావిగేషన్ ఉపగ్రహం NVS-03తో సహా మరో ఆరు ప్రయోగాలను ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణన్ తెలిపారు. GSLV-F15 రాకెట్ మిషన్ డైరెక్టర్(GSLV-F15 Rocket Mission Director) థామస్ కురియన్ మాట్లాడుతూ, GSLV ద్వారా GTO లేదా సబ్-GTO కక్ష్యలోకి ప్రయోగించిన ఉపగ్రహాలలోనే ఇది అత్యంత బరువైనదని తెలిపారు. ఈవోఎస్-05 ఉపగ్రహం బరువు దాదాదపు 2,367 కిలోలు ఉంటుంది. సుమారు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రో ఈ మిషన్ చేపట్టడం విశేషం. సీఎస్ఎల్ వీ సిరీస్ లో 19వ రాకెట్ ప్రయోగం ఇది.

GSLV F17 రాకెట్ ఉద్దేశం

దేశ భౌగోళిక సరిహద్దుల సమాచారాన్ని రియల్ టైమ్ లో సేకరించడం.

భూమికి దాదాపు 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య నుంచి నిరంతర పర్యవేక్షణ.

సరిహద్దు ప్రాంతాలను వేగంగా, స్పష్టంగా కెమెరాలతో ఈవోఎస్-05 పరిశీలించనుంది.

తుఫానులు, వరదలు, భూకంపాలను నిమిషాల వ్యవధిలోనే ఈవోఎస్-05 గుర్తిస్తుంది.

ప్రకృతి విపత్తులపై ఈవోఎస్-05 ఉపగ్రహం ముందస్తు హెచ్చరికలు జారీ చేయనుంది.

పంటల ఆరోగ్యం, భూ వినియోగంలో మార్పులను ఈవోఎస్-05 పరిశీలిస్తుంది.

నీటి వనరులు, అటవీ విస్తీర్ణాన్ని ఎప్పటికప్పుడు ఈవోఎస్-05 అంచనా వేయనుంది.