4 September, 2026 | 7:04 AM

సురేఖపై వేటు

04-09-2026 | 05:55am

మంత్రివర్గం నుంచి బర్తరఫ్.. సీఎం రేవంత్‌రెడ్డి సిఫారస్‌కు గవర్నర్ ఆమోదం

  1. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉత్కంఠకు తెర 
  2. మరో ముగ్గురు బీసీ మహిళలకు పదవులు 
  3. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి 
  4. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద 
  5. ‘కుడా’ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి నియామకం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్‌(State Congress)లో  కొద్ది రోజు లుగా నలుగుతున్న కొండా సురేఖ(Konda Surekha) ఎపిసోడ్‌కు తెరపడింది. ఆమెను మంత్రివర్గం(Cabinet) నుంచి బర్తరఫ్(Dismissal) చేయాలని సిఫారసు(Recommendation) చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) రాసిన లేఖకు గవర్నర్ శివప్రసాద్ శుక్లా(Sivaprasad Shukla) ఆమోదముద్ర వేసి సంతకం చేశారు. ఈ మేరకు కొండా సురేఖ(Konda Surekha)ను క్యాబినెట్ నుంచి తొలగించడం జరిగింది. అంతకు ముందు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేం దుకు కాంగ్రెస్ హైకమాండ్ క్లియరెన్స్(High Command Clearance) ఇచ్చింది.

దీంతో తక్షణమే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు పంపిన లేఖ లో స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి గురువా రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్న ట్లుగా లోక్‌భవన్ ప్రకటన విడుదల చేసింది.

అదే విధంగా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తొలగించారు. అయితే కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం కోరినా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి గవర్నర్‌కు  లేఖ రాశారు. ఆ తరువాత పార్టీలో నాటకీయ పరిణామాలకు తెరపడినట్లైంది.  

కూతురు వ్యాఖ్యలే సురేఖ పదవికి ఎసరు?

పరకాల టికెట్ ఆశిస్తున్న కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు కారణమని పార్టీ నేతలు అంటున్నా రు. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికే మళ్లీ టికెట్ ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను సుష్మిత సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలపై  అవినీతి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై పలువురు నేతలు పీసీసీకి ఫిర్యా దు చేశారు.

పీసీసీ ఆదేశాల మేరకు  మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. సుష్మిత వ్యాఖ్యలు పార్టీ ప్రతి ష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. కూతురు వ్యాఖ్యలను తల్లి గా మంత్రి కొండా సురేఖ ఖండించకపోవ డం, పార్టీ వ్యవహారంలో గతంలోనూ ఆ మెకు హెచ్చరికలు ఉన్నాయని, అయినా ఆ మెలో మార్పు కనిపించడం లేదని పేర్కొం ది. ఈ మేరకు మంత్రివర్గం నుంచి తొలగించాలని టీపీసీసీ ఏకగ్రీవంగా తీర్మానించి నివేదికను హైకమాండ్‌కు పంపింది. 

హస్తిన వేదికగా హైడ్రామా..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెడ్డి, ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హస్తినలో పార్టీ హైకమాండ్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్‌తో సమావేశమయ్యారు. పార్టీలో క్రమశిక్షణే ముఖ్యమని కఠిన చర్యలు తీసుకోకపోతే పార్టీలో తిరుగుబాట్లు పెరుగుతా యని వేదించారు. ఢిల్లీ వెళ్లిన కొండా సురేఖ కూడా ఖర్గేను కలిసి తన వాదన వినిపించారు.

తాను బీసీ సామాజికవర్గానికి చెం దిన వారమని, తమ కుటుంబానికి పెద్ద ఓ టుబ్యాంక్ ఉందని చెప్పుకొచ్చారు. అయినా శాంతించని హైకమాండ్ రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. సురేఖ అందుకు అంగీ కరిచకపోవటంతో సీఎం రేవంత్ నేరుగా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని సిఫా ర్సు చేస్తూ గవర్నర్‌కు  లేఖ పంపగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. 

ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు.. చిన్నారెడ్డిపై వేటు

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి పైన ప్రభుత్వం వేటు వేసింది. ప్రణాళికా సం ఘం వైస్ చైర్మన్‌గా ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. చిన్నారెడ్డి తొలగింపునకు ప్రధాన కారణంగా ఇటీవల ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది.

ఆగస్టు 16న వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్ మండల కార్యాలయ ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్న చిన్నారెడ్డి.. సొంత పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పార్టీ హైకమాండ్ ఆయనపై వేటు వేసింది. 

 బీసీలకు ప్రాధాన్యం

మంత్రి పదవి నుంచి సురేఖను తప్పించడంతో ప్రభుత్వం మరో ముగ్గురు బీసీ మ హిళలకు పదవులు కల్పించింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలుగా గద్వాల విజయలక్ష్మి (మున్నూరు కాపు), మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద (గౌడ ), కాకతీయ అర్బన్ డైవలప్‌మెంట్ అథార్టీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి (పద్మశాలి) నియమించింది. కొండా సురేఖ పద్మశాలి, ఆమె భర్త కొండా మురళి  ము న్నూరు కాపు  సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.

దీని ద్వారా ప్రభు త్వం బీసీలకు వ్యతిరేకం కాదని, వ్యక్తిగత, పాలనాపరమైన కారణాల వల్లే నిర్ణయాలు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. కొండా సురేఖ బీసీ కార్డుకు కాం గ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన కౌంటర్ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు చిన్నారెడ్డిని తప్పించి.. ఆయన స్థానంలో గద్వాల విజయలని నియమించారు. 

క్యాబినెట్‌లో మూడు బెర్తులు ఖాళీ

మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో క్యాబినెట్‌లో మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని ఎ మ్మెల్యేల సంఖ్యను బట్టి మంత్రివర్గంలో సీఎం, 17 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి, 15 మంది మంత్రులు ఉండగా, కొండా సురేఖ బర్తరఫ్‌తో మంత్రుల సంఖ్య 14కు చేరింది.  మూడు బెర్తులను ఎవరితో భర్తీ చేస్తారనేది? ఆసక్తిగా మారింది.  

బర్తరఫ్ జాబితాలో సురేఖ నంబర్ ౩ 

కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త రికా ర్డు నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను తొలగించిన జాబితాలో మూడో మంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వం లో తొలి మంత్రిగా కొం డా సురేఖ నిలిచారు. బర్తరఫ్ అయిన తొలి మహిళా మంత్రిగా కూడా సురేఖ చరిత్రకెక్కారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ మొదటి దఫా పాలనలో 2015లో అ ప్పటి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చే శారు. బీఆర్‌ఎస్ రెండో దఫాలో 2021 లో ఈటల రాజేందర్ కూడా వేటుకు గురయ్యారు. అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలపై పదవి నుంచి ఈట లకు ఉద్వాసన పలికారు.