నేటి నుంచి శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్ర వార్షికోత్సవాలు
07-08-2026 01:56 AM
3 రోజుల పాటు విశేష పూజలు
జడ్చర్ల, ఆగస్టు 6 (విజయక్రాంతి): మండలం కావేరమ్మపేటలోని శ్రీగిరి అష్టలక్ష్మీ క్షేత్రంలో 15వ వార్షిక మహోత్సవాలు ఆగస్టు 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. క్షేత్ర వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ఆచార్య కృష్ణానంద స్వామి మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో శ్రీ పాలమూరు విష్ణుసహస్రనామ ఏకాదశి అఖండ పారాయణ బృంద 50వ స్వర్ణోత్సవం, శ్రీ సప్తముఖి యాగామహోత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గోదావరి, అనంతగిరి, అరకు, అత్రేయపురం, బ్రహ్మం పీఠాల స్వామీజీలు, ఎంపీ గడ్డం రంజిత్ కుమార్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులు హాజరవుతారు. మూడు రోజుల పాటు అన్నప్రసాద వితరణ ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.






