వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
23-09-2026 | 12:09am
జన్నారం, (విజయక్రాంతి): వినాయక నిమజ్జన(Vinayaka immersion) ఉత్సవానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ వాగు సమీపంలో ప్రత్యేకంగా మొరం (మట్టి) పోయించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, విగ్రహాల వాహనాలు నేరుగా వాగు వద్దకు వెళ్లేలా మౌలిక వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో రాహుల్, ఉప సర్పంచ్ అప్పల జలపతి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.