ఒమన్ లో నౌకపై దాడి
- భారతీయుడు మృతి
- భారత ఎంబసీ వెల్లడి
దుబాయ్, సెప్టెంబర్ 23: భారత్(India)కు ప్ర యాణిస్తున్న ‘ఎంవీ కేప్ దావో’ అనే వాణిజ్య నౌక(Merchant ship)పై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు ఒమన్(Oman)లోని భారత రాయబార కార్యాలయం(Embassy of India) బుధవారం తెలిపింది. ఈ దాడికి సంబంధించిన పరిణామా లను తాము నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. నౌకలోని 19 మంది భారతీయులతో(Indians) సహా సిబ్బంది అందరి భద్రత విషయంలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని ఎంబసీ చెప్పింది.
‘ఈ దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం మాకు తీవ్ర విచారాన్ని కలిగించింది. మృతుని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా(X account)లో ప్రకటించింది. నౌకపై ఎవరు దాడి చేశారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తాము ఆర్‌పీఎస్‌ఎల్‌తో సమన్వయం చేసుకుంటున్నామని, మృతుని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ తెలిపింది.