మహిళపై లైంగిక దాడి యత్నం
- రూ.60 వేలతో క్యాబ్ డ్రైవర్ పరారీ
- రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ సమీపంలో ఘటన
శంషాబాద్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): హైదరాబాద్ శివారులో మహిళల భద్రతపై(Womens Safety) ఆందోళన కలిగించే దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. రాత్రి వేళ ప్రయాణిస్తున్న ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని, క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి(Cab driver sexual assault) యత్నించడమే కాకుండా ఆమె వద్ద ఉన్న నగదుతో పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గచ్చిబౌలికి చెందిన 35ఏళ్ల మహిళ వ్యక్తిగత పనిపై ఆదివారం రాత్రి ఓ క్యాబ్ ఎక్కింది. ఆమె వద్ద రూ.60వేల నగదు ఉంది. దీనిపై కన్నేసిన డ్రైవర్, శంషాబాద్ సర్కిల్ పరిధిలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద షార్ట్‌కట్ నెపంతో కారును సర్వీస్ రోడ్డు వైపు మళ్లించాడు.
కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు ఆపి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలు ప్రాణభయంతో కారు నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ భయపడి ఆమె నగదు బ్యాగ్‌తో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు(RGIA Police) కేసు నమోదు(Police register a case) చేసి క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 2019లో ఇదే ప్రాంతంలో దిశా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోసారి ఒక మహిళాపై లైంగిక దాడి నేపథ్యంలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.