19 August, 2026 | 2:00 AM

ప్రతిభకు పురస్కారం

19-08-2026 12:00 AM

అర్జున అవార్డు గ్రహీతలు

  1. అర్జున అవార్డుల ప్రకటన
  2. గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్‌కు అర్జున
  3. ఖేల్త్న్రకు ఎవరినీ ఎంపిక చేయని వైనం

న్యూఢ్లిల్లీ, ఆగస్టు 18 : ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అర్జున అవార్డుల జాబితాలో అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్లేయర్ దివ్యా దేశ్‌ముఖ్, తెలుగుతేజం బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గాయత్రి గోపిచంద్, పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు అర్జున అవార్డు దక్కింది.

మహారాష్ట్రకు చెందిన చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్‌ముఖ్ గత కొంతకాలంగా మహిళల చెస్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ గెలిచిన 88వ భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కింది. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే బ్యాడ్మింటన్‌లో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ , ట్రీసా జాలీతో కలిసి మహిళల డబుల్స్లో విజయవంతమైన జోడీగా రాణిస్తోంది.

2022 కామన్ వెల్త్ గేమ్స్ మహిళల డబుల్స్ విభాగంలో ట్రీసా జాలీతో కలిసి కాంస్య పతకం, మికస్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. అలాగే 2022 ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో సెమీఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళల డబుల్స్ జోడీగా ట్రీసా-గాయత్రి చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టైటిల్ ను గెలిచిన ఈ జోడీ ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ వరల్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇదిలా ఉంటే తెలంగాణ పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్ విజయాలకు గుర్తింపు లభించింది. ఈ యువ షూటర్ కూడా అర్జున పురస్కారానికి ఎంపికయ్యాడు. వినికిడి, మాటల లోపం ఉన్నప్పటికీ సాధారణ కేటగిరీ పోటీల్లోనూ పాల్గొంటూ భారతదేశంలో టాప్-15 షూటర్లలో ఒకరిగా నిలిచాడు. ధనుష్ తన కెరీర్లో ఇప్పటివరకు మొత్తం నాలుగు డెఫ్లింపిక్స్ స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు.

అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్, వి, ప్రియాంక గోస్వామి. 

బ్యాడ్మింటన్:  ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్, బాక్సింగ్:  నరేందర్ బెర్వాల్, 

చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్ముఖ్, పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్, 

హాకీ: లాల్రెమ్సియామి, రాజ్కుమార్ పాల్, కబడ్డీ: సుర్జీత్, పూజ, పారా-షూటింగ్: రుద్రాంశ్ ఖండేల్వాల్, పారా-అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్, రోయింగ్: అరవింద్ సింగ్, షూటింగ్: అఖిల్ షియోరాన్, ద్రోణాచార్య అవార్డులు: పార్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ 

యాదవ్ (బాక్సింగ్), నేహా నంద్కుమార్ చవాన్ (షూటింగ్)