స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన
22-09-2026 | 10:03pm
బూర్గంపాడు,(విజయక్రాంతి): పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంచి, వారిని స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని జెడ్పీ సీఈవో నాగలక్ష్మి(ZP CEO Nagalakshmi) అన్నారు. మంగళవారం మోరంపల్లిబంజర్ ఎంపీపీఎస్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ మోరంపల్లిబంజర్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి,ఎంపీఓ రామకృష్ణ,ఏపీఓ విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరోమణి, ఉపాధ్యాయులు రామారావు రేవతి, పంచాయతీ కార్యదర్శి భవాని,ఉప సర్పంచ్ పొక్కుల రవి, వార్డు సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.