రిటైర్డ్ క్రికెటర్లకు అండగా బీసీసీఐ
చాముండేశ్వర్‌నాథ్ ప్రతిపాదనకు బోర్డు అంగీకారం
ముంబై, సెప్టెంబర్ 20 : రిటైరయిన క్రికెటర్ల(Retired cricketers) కోసం బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసు కుంది. వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే విషయంలో ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్(Indian Cricketers Association) పురుషుల ప్రతినిధి, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వి.చాముండేశ్వర్‌నాథ్(Chamundeswarnath) ప్ర తిపాదనకు అంగీకారం తెలిపింది. వన్‌టైమ్ హెల్త్ బెనిఫిట్ స్కీమ్(One time Health Benefit Scheme)కు సంబంధించిన మొ త్తాన్ని పెంచాలన్న ప్రతిపాదనకు బీసీసీఐ ఏజీఎంలో ఆమోదం లభించింది.
దీని ప్రకా రం 10 లేదా అంతకంటే ఎక్కువ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు హెల్త్ స్కీమ్ కింద రూ.15 లక్షల రూ పాయల వరకూ బోర్డు ఆర్థిక సహాయం అందిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అందుబాటులోకి రానుందని చాముండేశ్వర్‌నాథ్ తెలిపారు. 25 లేదా అంతకంటే ఎక్కువ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు ప్రస్తుతం రూ.30 వేల పెన్షన్ లభిస్తుండగా, ఈ పథకంలో 5 నుంచి 24 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారిన కూడా చేర్చాలని చాముండేశ్వర్‌నాథ్ బీసీసీఐని కోరారు. త్వరలోనే బో ర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.