బీసీలకు రాజ్యాధికారం దక్కాల్సిందే
టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలో జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు జనాభాకు తగిన రాజ్యాధికారం, భూమి, నాణ్యమైన విద్య, వైద్యం అందాలన్న లక్ష్యంతోనే బీసీ రాజ్యాధికార యాత్ర చేపట్టినట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అన్నారు. బీసీ రాజ్యాధికార యాత్ర(BC Political Empowerment Yatra) ఏడో రోజు పరిగి నుంచి వికారాబాద్(Vikarabad) వైపు కొనసాగింది. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను కలుస్తూ సాగిన పాదయాత్ర 122 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది.
వికారాబాద్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూమి, సంపద, రాజకీయ అధికారం రెడ్డి,వెలమల సామాజిక వర్గాల వద్ద అసమానంగా కేంద్రీకృతమైందని మల్లన్న అన్నారు. కులగణనలో బీసీల లెక్కలు తప్పు ఉన్నాయ్ నిరసనగా ఆ పత్రాలను తగబెడితే బీసీల కోసం మాట్లాడుతున్న తనను కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని రేవంత్ రెడ్డి సస్పెండ్ చేశారని అన్నారు.
రైతు రుణమాఫీ(Farm Loan Waiver) పేరుతో బీసీల పేరుమీద 9వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఎంపీ గా పోటీ చేసిన రంజిత్ రెడ్డికి 5వేల కోట్ల మాఫీ చేశారని సంచలన విషయాన్ని వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు విషయంలో ఎదురైన అడ్డంకులను ప్రస్తావించిన మల్లన్న, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగకుండా కోర్టులో కేసు వేసి రెడ్లు అడ్డుపడ్డారని మండిపడ్డారు.