7 May, 2026 | 11:17 PM

ఏబీడీ ఇంటిగ్రేటెడ్ సెంటర్ కు ఉత్తమ కర్మాగార అవార్డ్

07-05-2026 10:28 PM

మే 2026: భారతదేశంలో ఉత్పత్తి పరిమాణం పరంగా అతిపెద్ద దేశీయ స్పిరిట్స్ సంస్థ అయిన 'అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్ (ఏబీడీ), తెలంగాణలోని వనపర్తి జిల్లా, రంగపూర్ సమగ్ర తయారీ కేంద్రం 'ఉత్తమ కర్మాగారం/నిర్వహణ' పురస్కారాన్ని దక్కించుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 'కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ఈ గుర్తింపును ప్రదానం చేసింది.

ఏబీడీ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్‌కు చెందిన కీలక ప్రోడక్ట్ సెంటర్లలో ఒకటి. ఇందులో ఈఎన్ఏ డిస్టిలరీ, ఐఎంఎఫ్ఎల్ బాట్లింగ్ యూనిట్, అలాగే 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైన పీఈటీ బాటిల్ తయారీ ప్లాంట్ ఉన్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ మౌలిక సదుపాయాలు ప్రోడక్ట్ ప్రాసెస్‌లు, వ్యయ నియంత్రణ మరియు సరఫరా గొలుసుపై సంస్థకు మెరుగైన పర్యవేక్షణను అందిస్తాయి. ఏబీడీ యొక్క ప్రీమియం పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం కోసం, రాబోయే మాల్ట్ డిస్టిలరీతో ఈ కేంద్ర సామర్థ్యాలు మరింత విస్తరించనున్నాయి, తద్వారా సింగిల్ మాల్ట్ ప్రోడక్ట్ సామర్థ్యాలు కూడా  మరింత విస్తరించనున్నాయి. 

ఈ తయారీకేంద్రంలో సుమారు 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ వైవిధ్యానికి ఇది మంచి ఉదాహరణగా నిలుస్తూ, మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 50% మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద స్థాయి పారిశ్రామిక కేంద్రాన్ని స్థాపించడం ద్వారా, ఏబీడీ  స్థానిక ప్రజలకు నైపుణ్యం మరియు పాక్షిక నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను సృష్టించింది. దీని ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతోంది. అలాగే నిబంధనలకు కట్టుబడి ఉండే ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ఏర్పాటు చేసిన ఈ గుర్తింపు, భద్రతా ప్రమాణాలు, చట్టబద్ధమైన నిబంధనల పాటింపు వంటిని పురస్కారం దక్కడంలో కీలకపాత్ర పోషించాయి.