27 June, 2026 | 10:55 PM

దుఃఖంలో సైతం మానవత్వం చాటిన తల్లిదండ్రులు

27-06-2026 09:54 PM

కుమారుని నేత్రాలు ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ కు దానం

ధర్మపురి,(విజయక్రాంతి): చేతికoదోచ్చిన కుమారుడు నాలుగు రూపాయలు సంపాధిస్తూ కళ్ళముందర తమతో కలిసి ఉండాలనీ ఏ తల్లితండ్రులైన కోరుకుంటారు. కానీ కళ్ళముందే ఆ తల్లిదండ్రులకు ఆసరగా అండగా నిలవాల్సిన కుమారుడు శవమై కనిపించాడు.ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరు ఆపలేని పరిస్థితి. మిగిలిన కుటుంబ సభ్యులు, గ్రామం అంతా దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే వెల్గటూర్ మండలం రాజక్కపల్లికి చెందిన గుమ్ముల సాయిమనోజ్(22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పుట్టెడు దుఃఖంలోనూ కుమారుని చివరి కోరికను ఆ తల్లిదండ్రులు నెరవేర్చారు. ఐ బ్యాంక్ కు తన నేత్రాలను  దానం ఇవ్వాలన్న కుమారుని కోరిక కు అనుగుణంగా హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ కు దానం చేశారు. తను చనిపోతూ కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపేందుకు మృతుడు సాయి మనోజ్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. దేశంలోని అంధుల పట్ల ఆ కుటుంబం చూపిన మానవతా దృక్పథానికి ఐ ఇన్స్‌టిట్యూట్ డైరెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.