30 March, 2026 | 2:59 AM

భారత్ చిప్ మా కల

12-09-2024 02:40 AM
  1. ప్రపంచంలో అన్ని డివైజుల్లో మన చిప్ ఉండాల్సిందే 
  2. ప్రధానమంత్రి నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రపంచవ్యాప్తంగా ప్రతి డివైజ్‌లో భారత్‌లో తయారు చేసిన చిప్ ఉండాలనేది తన కల అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన సెమికాన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రధాని.. సెమీకండక్టర్ల కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్‌లో చిప్‌ల కూ ఎప్పుడూ కొరత రాదని భరో సా ఇచ్చారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.

భారత్‌ను సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా మా ర్చేందుకు చేయాల్సినదంతా చేస్తామన్నారు. దేశంలో ప్రస్తుతం 3డీ పవర్.. సంస్కరణలు, తయారీరంగం, ఆశావహ మార్కెట్‌కు అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. సాంకేతికత రుచి తెలిసిన వారికి ఇలాంటి మార్కెట్ మరో చోట దొరకడం కష్టమని తెలిపారు.