27 July, 2026 | 3:53 PM

భారతరత్న అబ్దుల్ కలాం 11వ వర్ధంతి వేడుకలు

27-07-2026 02:45 PM

ఆలేరు, జులై 27 (విజయక్రాంతి): రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం(Bharat Ratna Abdul Kalam) 11వ వర్ధంతి సభ సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, 'కలలు కనండి.. సాకారం చేసుకోండి' అనే స్ఫూర్తిని విద్యార్థులకు అందించిన మహామేధావి అని కొనియాడారు, అదేవిధంగా రాఘవ సంస్థ ఆధ్వర్యంలో కలాం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు.

అక్టోబర్ 10వ తేదీ కలాం జయంతి నాటికి విగ్రహావిష్కరణ పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగ నరసింహులు, పులిపలుపుల మహేష్, 3వ వార్డు కౌన్సిలర్ యాట శివ, 4వ వార్డు కౌన్సిలర్ బీజని కళ్యాణి మధు, మాజీ వార్డు మెంబర్లు పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, మోతి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కట్టే గుమ్ముల సాగర్ రెడ్డి, జర్నలిస్టులు ఎండి కుర్షద్ పాషా, ఎర్ర జాన్సన్, ప్రజా సంఘాల నాయకులు కంతుల శంకర్, ఏలుగుల వెంకటేష్, ఎండి ఫయాజ్, పడగంటి చందు, మైదం భాస్కర్, పేరపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.