27 July, 2026 | 4:16 PM

శాకాంబరీ అలంకారంలో దర్శనమిచ్చిన విద్యా సరస్వతి

27-07-2026 03:13 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని విద్యా సరస్వతి క్షేత్రంలో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించారు. ఆషాడ మాసంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం విద్యా సరస్వతిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. కాగా అమ్మవారిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.