జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చాటిన భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
22-09-2026 | 09:50pm
పలు విభాగాలలో బహుమతులు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 22 ( విజయ క్రాంతి ) : యువ టూరిజం క్లబ్(Youth Tourism Club) ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి 2026 పోటీలలో భూపాలపల్లి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాలలో బహుమతులు సాధించారు. అందులో భాగముగా పాటల పోటీలలో బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కె ప్రజ్ఞ ప్రథమ, బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని వి మమత ద్వితీయ బహుమతులు సాధించగా షార్ట్ ఫిల్మ్ పోటీలో బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థి ఎస్ వికాస్ ద్వితీయ బహుమతి సాధించారు. విద్యార్థులు బహుమతులు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఏ రమణ రావు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు.