యుగాంతం వరకు బీఆర్‌ఎస్

23-04-2024 02:20:03 AM

మాది ఉద్యమ పార్టీ,  తెలంగాణ ప్రజల గొంతుక

కాంగ్రెస్ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో వారికే తెలియదు

ప్రజలు గులాబీ పార్టీకే పట్టం కడుతారు

‘విజయక్రాంతి’తో ముఖాముఖీలో భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు గెలిచినా పెద్దగా ప్రయెజనం ఉండదన్నా రు. ఎందుకంటే వీరిలో ఎవరు గెలిచినా పార్టీ విజయంగా భావిస్తారని అన్నారు. వారు పార్టీ ప్రయెజనాల కోసం, వారి స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తారని విమర్శించారు. అదే బీఆర్‌ఎస్ గెలిస్తే తెలంగాణ గెలిచిందని అంటారని, కేవలం రాష్ట్రం కోసమే తాము పనిచేస్తామని స్పష్టం చేశా రు. బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి వీడదీయరాని బంధం ఉందన్నారు. మేము 10 గెలిచినా, 15 గెలిచినా రాష్ట్రం, ప్రజల కోసమే పనిచేస్తూ కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకువస్తామని వెల్లడించారు. సోమవారం మల్లేశ్ నామినేషన్ వేసిన అనంతరం ‘విజయక్రాంతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. 

కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చేది లేదు. మీరు ఎంపీగా గెలిస్తే ఏలా అభివృద్ధి చేస్తారు?

కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే భువనగిరి నియెజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. తెలంగాణ ప్రయెజనాల కోసం పార్లమెంట్‌లో మాట్లాడతా. తెలంగాణ మీదనే మా ధ్యాస, మా యాస.

మీరు బలహీనమైన అభ్యర్థి అంటున్నారు. దీనికి మీరెమంటారు?

నేను గత 30 ఏళ్లకుపైగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేసినప్పుడు ఇప్పుడున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాల్లోనే లేరు. నా రాజకీయ అనుభ వంలో ఇప్పుడు ఉన్నోళ్లంతా జూనియర్లే. ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులు నాతో పాటు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని, భువనగిరిలో చర్చకు రావాలి. అందరి కంటే నేనే మచ్చలేని నాయకుడిని. ఒక్కసారి ఎన్నికల అఫిడవిట్ చూస్తే మీకే తెలుస్తుంది. 

బూర నర్సయ్య గౌడ్ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానని, బీఆర్‌ఎస్ గెలిస్తే ఏమీ తేరని అంటున్నారు. 2014 ఎంపీగా గెలిచి ఏం చేయలేదు కాబట్టే ప్రజలు 2019లో ఓడగొట్టారు. మళ్ళీ 5 ఏళ్లు ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇప్పుడు ఏలా గెలుస్తారు?  కనీసం నందనంలో నీరా ప్లాంటును గీత కార్మికులకు అందుబాటులోనికి తీసుకురాలేకపోయారు. 

భువనగిరిలో ఎంపీగా గెలిస్తే ఎలా అభివృద్ధి చేస్తారు?

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన సారథ్యంలో భువనగిరి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించి, నిరుద్యోగులకు ఉద్యోగావకా శాలు, ఐటీ పరిశ్రమల ఏర్పాటు కోసం పనిచేస్తా. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా. అందరికీ ఒక అన్నలాగా, తమ్ముడిలా మీలో ఒక్కడిగా మీ బిడ్డగా పన్నిచేస్తా. ఏ రాత్రి ఫోన్ చేసినా స్పందిస్తా. వాళ్లకు అండగా ఉంటా. 

బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోందని కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయి. మీరు ఏలా గెలుస్తారు?

బీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ. ప్రజల పార్టీ. యాదాద్రిలో శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఉన్నం zత వరకు, కలియుగం అంతమయ్యేవరకు తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఉం టుంది. తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ. అది కేవలం దుష్ప్రచారం మాత్రమే.

భువనగిరిలో త్రిముఖ పోటి ఉంటుందా?

భువనగిరిలో ఒకాయన (బీజేపీ) రాము డు అని, గుడి అని అంటున్నారు. బీజేపీ పుట్టకముందే  మా తాతలు గ్రామాల్లో గుడులు నిర్మించారు. ఇక ఇంకొకరు (కాంగ్రెస్) భువనగిరి ప్రజలకే తెలియదు. ఇది ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఆ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో వారికే తెలియదు. ఇక వారు పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదు. అసలు వారు ఏ ప్రజాసమస్యల మీద పనిచేయలేదు. వారిని ప్రజలు ఆశీర్వదించారు అంతే.. 

ఆరు గ్యారెంటీల అమలు మీ గెలుపుపై ప్రభావం చూపుతుందా?

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు తప్ప ఏదీ పూర్తిస్థాయిలో అమ లు చేయలేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, కరెంట్ కోతలతో పాటు రైతులకు రైతు బంధు, బీమా పథకాలు అమలు కావడంలేదు. కాంగ్రెస్ 420 అబద్ధాలతో అధికా రంలోకి వచ్చింది. ఆ పార్టీపై ప్రజలలో త్రీవ వ్యతిరేకత ఉంది. 

ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏలా ఉండబోతుంది?

రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, చేసిన పనులు ఏమీ లేకపోవడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ రాముడు పేరుతో ఓట్లు అడుగుతోంది. ఆ పార్టీకి తెలంగాణలో చోటు లేదు. ఎన్నికల్లో అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. తీర్పు బీఆర్‌ఎస్ వైపే ఉంటుందని కార్యక ర్తలు, పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. నేనే భువనగిరి గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తా. నా గెలుపు తథ్యం.