14 July, 2026 | 12:17 PM

సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై స్పందించిన భార్య శిల్ప

18-05-2024 01:34 PM

హైదరాబాద్: త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది. చందు ఐదేళ్లుగా నటి పవిత్రతో సహజీవనం చేస్తున్నాడని శిల్ప చెప్పింది. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వెల్లడించింది. 11 ఏళ్లు ప్రేమించుకుని, తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నామని తెలిపింది. తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

పవిత్ర కారణంగానే ఇలా జరిందని ఆరోపించింది. ఆమెతో పరిచయం వల్లే విభేదాలు వచ్చాయని చెబుతోంది. ఆమె కారణంగానే చందు నాకు దూరం అయ్యాడని శిల్ప కన్నీరుమున్నీరైంది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో చందు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

చందుకు భార్య, ఇద్దరు పిల్లలు.. గత కొన్ని సంవత్సరాలుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందింది. ప్రస్తుతం చందు మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంది. కుటుంబ సభ్యులు ఇంకా అక్కడికి చేరుకొలేదని తెలుస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో పంచనామా పూర్తయిన తర్వాత మార్చురీకి వెళ్లనున్నారు కుటుంబీకులు. ఆ తర్వాత చందు మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయనున్నట్లు సమాచారం.