కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలం ఎందా గ్రామపంచాయతీకి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాథోడ్ ఉమాజి, జాదవ్ గుణ్వంత్ రావు, రాథోడ్ రాజేందర్, చౌహాన్ కళ్యాణ్, పట్టెపు లక్ష్మణ్, రాయల అర్జున్, రాయల ఎల్లన్న, రాథోడ్ గుణ్వంత్ రావు, అజయ్, రాజన్న, గోయ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, ఎందా గ్రామ సర్పంచ్ రాథోడ్ కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షులు రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.