పట్టబద్రులంతా ఈనెల 28 వరకు ఓటును నమోదు చేసుకోవాలి

04-10-2026 | 06:12pm

మాగనూరు, అక్టోబర్ 4: మండలంలోని డిగ్రీ విద్య(Undergraduate Education) పూర్తి చేసుకున్న పట్టబద్రులంతా ఈనెల 28 తేదీలోపు ఓటరును నమోదు(Voter Registration) చేసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి(Bangla Lakshmi Kanth Reddy) అన్నారు. ఆదివారం మాగనూరు మండల కేంద్రంలో నిర్వహించిన పట్టా బద్రుల ఓటు నమోదు కార్యక్రమం ,బిజెపి కార్యకర్తల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులంతా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

మహబూబ్నగర్, రంగారెడ్డి ,హైదరాబాదు, జిల్లాల పట్టభద్రుల(mlc ) ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పా రం -18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి గడుపులోగా నమోదు చేసుకోవాలని వారు సూచించారు. మాగనూరు మండలంలో 100% పట్టభద్రుల ఓటు నమోదే లక్ష్యంగా పనిచేయాలని వారి కోరారు.

ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు జయ నంద రెడ్డి, జిల్లా నాయకులు వాకిటి మల్లేష్, మండల కిషన్ మోర్చా అధ్యక్షులు నరసింహారెడ్డి, బిజెపి నాయకులు రాంగోపాల్  శెట్టి , నారాయణరెడ్డి, పురుషోత్తం రెడ్డి, కడిచూరు సుమన్, కేశవరెడ్డి, అనిమిరెడ్డి, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు