మ్యాన్‌హోల్‌లో నవజాత శిశువు మృతదేహం
కూకట్‌పల్లి, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): కేపీహెచ్‌బీ లులూ మాల్(KPHB Lulu Mall) సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి(Private hospital) వద్ద మ్యాన్ హోల్(Manhole)లో నవజాత శిశువు(Newborn baby) మృతదేహం మంగళవార ం కలకలం రేపింది. హాస్పిటల్ సమీపంలోని అపార్ట్మెంట్ వాసులు డ్రైనేజ్ బ్లాక్ అయినదని మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు(Complaint) చేశారు. ఫిర్యాదు అందుకున్న సిబ్బంది డ్రైనేజీన్ శుభ్రం చేయడం లో భాగంగా మ్యాన్ హోల్ మూత తెరిచి శుభ్రం చేస్తుండగా మ్యాన్ హోల్ లోపల డ్రైనేజ్ పైప్ లైన్ కి అడ్డంగా నవజాత శిశువు మృతదేహం లభించింది.
దీంతో స్థానికులు మున్సిపల్ సిబ్బంది(Municipal staff) పోలీసులకు(Polices) సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీన పరచుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.