సర్పంచ్ కుర్చీ ఉంది.. బాత్ రూమ్ లేదు
- మహిళా సర్పంచ్లకు ఇదేం పరీక్ష?
- ప్రజల సమస్యలు తీర్చేందుకు పంచాయతీకి
- సొంత అవసరాలకు మాత్రం బయటకే!
కౌటాల,సెప్టెంబర్ 8(విజయక్రాంతి) గ్రా మ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యాలయాలే ( Panchayat offices) మహిళా సర్పంచ్లకు ఇబ్బందుల కేంద్రాలుగా మారుతున్నా యి. గ్రామ పాలనలో కీలక బాధ్యతలు చేపట్టిన మహిళా సర్పంచ్లకు ,మహిళా వార్డు మెంబర్లకు కనీస వసతులు కల్పించడంలో అ ధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంచాయతీ సమా వేశాలు, అధికారుల సమీక్షలు, గ్రామస్థులతో చర్చలు.. ఇలా విధుల్లో భాగంగా స ర్పంచ్లు కార్యాలయంలో గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. అయితే మహిళా సర్పం చ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో వారు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నా రు.మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెంచామని చెప్పుకుంటున్నా.. వారు పనిచేసే కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విరుద్ధంగా ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పదవి ఇచ్చి.. పనిచేసే వాతావరణం కల్పించకపోతే మహిళా సాధికారతకు అర్థమేంటి? అని మహిళా ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాల్సిన పంచాయతీల్లోనే మహిళా సర్పంచ్లకు మరుగుదొడ్డి లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు పంచాయతీ కార్యాలయాలను పరిశీలించి, మహిళా ప్రజాప్రతినిధులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.