ఈదులపల్లిలో బయోమెడికల్ మంటలు
- కాలుష్య కోరల్లో గ్రామాలు
రోడ్డెక్కేందుకు స్థానికులు సిద్ధం
నందిగామ, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): మండలంలోని ఈదులపల్లి పరిసర ప్రా ంతాల్లో బయోమెడికల్ వ్యర్థాల (Biomedical waste) నిర్వహణ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం తీవ్ర కలకలం రేపుతోంది. గత 27 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ‘జీజె మ ల్టీక్లేవ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్’ పరిశ్ర మ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, పర్యావర ణం తీవ్రంగా దెబ్బతింటోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో విష వాయువులు..
ఈదులపల్లి సమీపంలోని మోత్కులగూ డ, చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రధానం గా బంతి, చామంతి వంటి పూల తోటలను సాగు చేస్తుంటారు. అయితే, ఈ పరిశ్రమ రాత్రి సమయాల్లో నిబంధనలకు విరుద్ధంగా విషపూరితమైన పొగను, రసాయన వ్యర్థాలను వదులుతుండటంతో పూల తోటలు, ఇతరు పంటలు పూర్తిగా మాడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలో ఈ కాలుష్య గాలి పీల్చి, కలుషిత నీరు తాగి పలు పశువులు కూడా మృత్యువాత పడ్డాయని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
చట్టాలు కాగితాలకే పరిమితం
1986 పర్యావరణ పరిరక్షణ చట్టం కింద రూపొందించిన ‘బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2016’ (Bio-Medical Waste Management Rules) ప్రకారం ఆసుపత్రుల వ్యర్థాలను పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల కోడింగ్ ద్వారా నాలుగు రకాలుగా విభజించి మైక్రోవేవ్ సాంకేతికత మరియు ఆటోక్లేవింగ్ పద్ధతుల్లో సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. కానీ, లాభాపేక్షే ధ్యేయంగా నడిచే ఈ ప్లాంట్లో వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలను దొడ్డిదారిన బయటకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు
భూగర్భ జలాలు కలుషితం... ప్లాంట్ ను ంచి వెలువడే రసాయనాలు భూమిలోకి ఇం కిపోవడంతో తాగునీరు, సాగునీరు విషతుల్యంగా మారాయి. విషవాయువులతో ప్రజ లు ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, చ ర్మ సంబంధిత సమస్యలతో అల్లాడుతున్నారు.
నిర్లక్ష్యానికి రాజకీయ అండ?
పరిశ్రమ యాజమాన్యం తమిళనాడుకు చెందిన పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించింది కావడం, తెలంగాణ ప్రధాన కార్యాలయం అమీర్పేటలో ఉండటంతో అధికారులు స్థానికుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యక్ష ఆందోళనకు హెచ్చరిక
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ఈ బయోమెడికల్ ప్లా్ంప తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమను ఈ ప్రాంతం నుంచి తక్షణమే తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించని పక్షంలో ప్రజాసంఘాలు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని గ్రామస్థులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.