సమయానికి అందని సేవ..!

09-09-2026 | 05:05am
  1. మోతెలో మీసేవ ఒక్కటే.. తిప్పలే అనేకం..
  2. గతంలో మూతపడ్డ మరో మీ సేవ
  3. ధ్రువపత్రాల కోసం రోజుల తరబడి నిరీక్షణ
  4. రైతులు, విద్యార్థులకు తప్పని అవస్థలు.
  5. మరో మీ సేవను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్

మోతె, సెప్టెంబర్ 8 : మండలంలో 29 గ్రామపంచాయతీలు(Gram Panchayats) ఉండగా వివిధ పనుల నిమిత్తం రైతులు(Farmers), విద్యార్థులు(students) మండల కేం ద్రానికి వస్తుంటారు. వీరికి అవసరమైన ధ్రువపత్రాల(Certificates) మంజూరి కోసం ఏ విధమైన ఇబ్బందులు ఉండవద్దని ప్రభుత్వం గతంలో మండల కేంద్రానికి రెండు మీసేవ(Mee Seva) కేంద్రాలను మంజూరు చేసింది. కొంతకాలం రెండు బాగానే నడిచినప్పటికీ తరువాత కొన్ని అనివార్య కారణాలవల్ల అందులో ఓ మీసేవను మూసివేశారు దీంతో ఉన్న ఒకే కేంద్రా నికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ధ్రువపత్రాల కోసం వస్తున్నందున సకాలంలో సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తుంది.

 ఒక్కటే మీసేవ తిప్పలే అనేకం 

 మండల కేంద్రంలో ప్రస్తుతం ఒకే ఒక్క మీ సేవా(Mee Seva) కొనసాగుతుండటంతో రైతులు(Farmers), విద్యార్థులు(students), సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. కుల(Caste), ఆదాయం(, income), నివాస(, residence), కుటుంబ సభ్యుల ధ్రువపత్రాల(family member certificates)తో పా టు ఇతర ఆన్లైన్ సేవల(Online services) కోసం ప్రతిరోజూ వందలాది మంది మీ సేవకు వస్తున్నట్లు స్థా నికులు చెబుతున్నారు. పనులు రోజుల తరబడి, కొన్ని సందర్భాల్లో వారాల పాటు పెం డింగ్లో ఉంటున్నాయని తెలుపుతున్నారు. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదేవి ధంగా ఈ మీసేవ కేంద్రంలో సర్టిఫికెట్లకు అదనపు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 గతేడాది మూతపడ్డ మరొక మీసేవ కేంద్రం 

 గత ఏడాది మండల కేంద్రంలోని ఓ మీ సేవా కేంద్రంలో లేని భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చిం ది. దీంతో సంబంధిత నిర్వాహకుడితో పా టు పలువురు రైతులు, మండల రెవెన్యూ అ ధికారులపై కేసులు కాగా వారు జైలుపాలయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఘటన తర్వాత అది మూసివేయడంతో ప్రస్తుతం మండలంలో ఒకే ఒక్క మీ సేవా కేం ద్రం మాత్రమే నడుస్తుంది.

 సకాలంలో అందని సేవలు 

ప్రస్తుతం మండల కేంద్రంలో ఒకే ఒక మీ సేవ కేంద్రం ఉండడంతో పలు గ్రామాల నుండి వచ్చే ప్రజలు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అక్కడికే వెళ్లాల్సి వస్తుంది. దీంతో సేవలు సకాలంలో అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, విద్యార్థులు అత్యవసర ధ్రువపత్రాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులుప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచు కుని మోతె మండలానికి వెంటనే మరో మీ సేవా కేంద్రాన్ని మంజూరు చేసి సేవలను వేగవంతం చేయాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

మరో మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి 

మండల కేంద్రంలో ఒకటే మీసేవ ఉండడంతో అక్కడికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. దీంతో ఏదైనా ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయాలంటే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు, రైతులు అత్యవసరం అయినప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి. కావున మండల కేంద్రంలో మరో మీ సేవ వెంటనే ఏర్పాటు చేసి ఇబ్బందులను తొలగించాలి. 

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మరిన్ని వార్తలు