ఉత్తమ్ దంపతులను విమర్శించే స్థాయి బొల్లంకు లేదు

17-09-2026 | 08:50am

ఉత్తమ్ దంపతులు అభివృద్ధికి అంకితం

ఐఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ 

హుజూర్ నగర్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజా సంక్షేమమే ధ్యేయంగా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి లపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అడ్డగోలుగా విమర్శలు చేస్తే సహించేది లేదని ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్(Huzur Nagar Agricultural Market) మాజీ చైర్మన్,జెడ్ ఆర్ యు సి సి మాజీ మెంబర్ యరగాని నాగన్న గౌడ్ హెచ్చరించారు.

బుధవారం పట్టణంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...ఈనెల 19వ తేదిన కోదాడ లో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళా ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలను నాగన్న గౌడ్ ఘాటుగా ఖండించారు. హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న ఉత్తమ్ - పద్మావతి దంపతులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

ప్రజలే తమ పిల్లలుగా భావిస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకై వారు చేస్తున్న కృషిని ఓరవలేని బిఆర్ఎస్ నాయకులు విలువలు లేని విమర్శలు, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంటు చుక్కయ్య, బెల్లంకొండ గురవయ్య, చిట్యాల అమర్ నాధ్ రెడ్డి, మేళ్లచెర్వు ముక్కంటి, మద్దం నాగేందర్, గుంటుక కరుణాకర్ రెడ్డి, సలి కంటి జానయ్య, ఇంటి అచ్చమ్మ, చప్పిడి సావిత్రి, చౌడం శివ పార్వతి,కత్తుల రవీందర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు