లక్కారం కోదండ రామాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
14-03-2026 04:53 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని లక్కారం కోదండ రామాలయంలో గ్రామ ప్రజలు ఘనంగా బ్రహ్మోత్సవo కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవం పురస్కరించుకొని రామాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమంలో శాంతి కళ్యాణం హోమం శ్రీనివాస చారి పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భోజన కార్యక్రమం నిర్వయించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మాజీ సింగల్ చైర్మన్ గుజ్జుల రాజు రెడ్డి, ఉప సర్పంచ్ రాజూకుమార్, మాదసి రమేష్ సారయ్య, మధునయ్య, రాజ బాబు, రవి, బుచ్చయ్య, కొమురయ్య, గ్రామస్థులు భక్తులు పాల్గొన్నారు.




