బ్రిక్స్ ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాల ఆమోదం
12-09-2026 | 05:10pm
ఢిల్లీ: భారత్ నేతృత్వంలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్(Delhi Declaration)కు సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపాయి. డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం సంతోషకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు.
పాశ్యాత్య దేశాలకు పోటీగా ఎదిగే అంశాలపై చర్చిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో పాశ్చాత్యదేశాల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని మోడీ ఇవాళ తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని పాశ్చాత్య దేశాలకు తేల్చిచెప్పేశారు.