6 September, 2026 | 11:36 AM

420 హామీల ఎగవేతకు నిరసనగా బీఆర్ఎస్ సమరభేరి

06-09-2026 | 09:28am

నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపు మేరకు శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former MLA Jajala Surender) ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్,జాబ్ క్యాలెండర్,యూత్ డిక్లరేషన్ కొరకు విద్యార్థులు,యువతతో  కలిసి నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి,నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనకు యువత ప్రశ్న.!

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ...ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు.కానీ నేడు 1000 రోజులు దాటుతున్నా.యువతకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి.?కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌లోని ముఖ్యమైన 5 హామీలు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు,అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ.నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి.ఉద్యోగం లేదా ఉపాధి లభించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు ₹4,000 ఇస్తామని హామీ.నిరుద్యోగ నిర్మూలన – ₹10 లక్షల వడ్డీలేని రుణాలు.యువతకు స్వయం ఉపాధి,వ్యాపారాల కోసం ₹10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ.నాణ్యమైన ఉన్నత విద్య–ఫీజు రీయింబర్స్‌మెంట్.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్,ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధి చేస్తామని హామీ.యువ మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.18 ఏళ్లు పైబడిన కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని హామీ.హామీలు ఎక్కడ? – అమలు ఎక్కడ? యువతకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి.?ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, నాయకులు,సాయిబాబా మోతే శ్రీనివాస్,పుప్పాల నారాయణ,ఫరీద్,నారాయణ,వంశీకృష్ణ గౌడ్,నరేష్, మిద్దె బాబురావు,కాంతారెడ్డి, హనుమంత్ రెడ్డి,సాయిలు, పరిశోధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు