మండలి నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
- కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొడతారా?
మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ఎమ్మెల్సీలు బుధవారం శాసన మండలి (Legislative Council)నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని మండలి చైర్మన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌పై ఓటింగ్ నిర్వహించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఓటింగ్‌కు నిరాకరించారు.
చర్చ లేకుండా సభ్యులను సస్పెండ్ చేయడం, చైర్మన్, ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. దీనికంటే ముందు శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యా వత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కోడతారట.. ఎక్కడైనా ఇలా ఉంటుందా? అని ప్రశ్నించారు.
ఆయన చావు కోరుతారా, దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదని విమర్శించారు. తమ సభ్యుల సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని, తమ సభ్యులు సభలోకి వచ్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు. సస్పె న్షన్‌పై తమ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని, నిన్న (మంగళవారం) పెట్టిన తీర్మానంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.