సందడిగా క్రికెట్ టోర్నమెంట్
20-09-2026 | 06:16pm
- హనుమాన్ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహణ
- ఉత్సాహంగా పాల్గొన్న గణేష్ మండపాల నిర్వాహకులు
పాపన్నపేట,సెప్టెంబర్20: మండల కేంద్రం పాపన్నపేటలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ (Cricket tournament) సందడిగా సాగింది. హనుమాన్ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించగా గ్రామంలోని పలు గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించి యువకులను ఉత్సాహపరిచారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. యువత కేరింతలు, క్రీడాభిమానుల సందడి మధ్య క్రీడా ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.