28 February, 2026 | 10:11 AM

అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపు

28-02-2026 12:32 AM

మున్సిపల్ పాలకవర్గంకు సత్కారం

మొయినాబాద్, ఫిబ్రవరి 27: మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ సోనియా, వైస్ చైర్మన్ రాజు మరియు 26 మంది కౌన్సిలర్ల సన్మాన సభ శుక్రవారం అంజనాదేవి గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిలు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ పారదర్శకమైన పాలనతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ కౌన్సిలకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేసి అభివృద్ధిలో సహకారం అందించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిధుల కొరత ఉంటే అభివృద్ధి కొంటుపడుతుందన్నారు.

మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ  మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మాజీ జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి మాట్లాడుతూ మహిళా ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పామెన భీమ్ భరత్ మాట్లాడుతూ మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు మరియు రహదారుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మధుసూదన్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గౌరీ సతీష్ కుమార్ యాదవ్, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.