తరాలు మారిన చెరిగిపోని చరిత్ర... చాకలి ఐలమ్మ

10-09-2026 | 01:45pm

సర్పంచ్ తప్పట్ల. ఎల్లయ్య

వెంపటి లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు 

తుంగతుర్తి,(విజయక్రాంతి): భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన అసమాన్య ధైర్యవంతురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య(Sarpanch Thappatla Yellayya) అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి(Chakali Ilamma Death Anniversary) సందర్భంగా మండల పరిధిలోని వెంపటి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ధైర్యసహసాలను కొనియాడారు.

ఐలమ్మ పోరాట పటిమ, ఆమే తెగువ యావత్ మహిళా లోకానికి ఆదర్శమని అన్నారు. ఆమె భూమి కోసం, దొరల పెత్తనాన్ని ధిక్కరించి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత అని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతరాజు అంజయ్య, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, అబ్బగాని సత్యనారాయణ గౌడ్, తప్పట్ల శంకర్, భాష బోయిన వెంకన్న, మడిపెద్ది సోమ నరసయ్య, రజక సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు