వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

10-09-2026 | 01:19pm

అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి 

కామారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయం అని కామారెడ్డి అదనపు కలెక్టర్(Kamareddy Additional Collector) ఎన్.వై. గిరి అన్నారు. గురువారం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి(Chakali Ilamma) కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేలా కళాజాత బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రవితేజ, టీఎన్జీవో అధ్యక్షుడు నారాల వెంకట్ రెడ్డి, డీబీసీడీఓ నర్సయ్య, ఏబీసీడీఓ చక్రధర్, బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య, సాప శివరాములు, రజక సంఘం నాయకులు రాజయ్య, శ్రీకాంత్, మహేష్, బీసీ నాయకులు బతిని నఫా భూషణ్, ఎల్లయ్య, ఎంబీసీ నాయకులు నాగరాజు, శ్రీనివాస్, విజయ్ కుమార్, అశ్వక్, శాంతయ్య, స్వామి, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు