ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

10-09-2026 | 01:21pm

బెజ్జంకి, సెప్టెంబర్ 10: భూస్వాముల ఆగడాలపై తిరబడిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కత్తి రమేశ్‌ గౌడ్‌ అన్నారు. గురువారం బెజ్జంకి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా  కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కత్తి రమేశ్‌ గౌడ్‌, రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రమేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ భూమి, భుక్తి, పేదల విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. దేశ్‌ముఖ్‌లు, పోలీసులను ఎదిరించి తెలంగాణ పోరాట చరిత్రలో ఆమె చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, రజక సంఘం ప్రతినిధులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు