'చలో హైదరాబాద్' వాయిదా

10-09-2026 | 01:00pm

ఇది తాత్కాలిక విరామం మాత్రమే జేఏసీ చైర్మన్ 

ముకరంపుర, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఈ నెల 8న కరీంనగర్‌ లో నిర్వహించిన చలో హైదరాబాద్(Chalo Hyderabad) సన్నాహక సమావేశానికి దాదాపు 5,000 మంది ఉద్యోగులు హాజరై ఉద్యమ స్ఫూర్తిని చాటారని రాష్ట్ర జేఏసీ నాయకులు(JAC leaders) తెలిపారు.రాష్ట్ర జేఏసీ పిలుపునకు స్పందించి ఉద్యోగులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులు ఐక్యంగా నిలవడం చరిత్రలో నిలిచిపోయే విషయమని అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) సన్నాహక సమావేశం ద్వారా ప్రభుత్వానికి ఉద్యోగుల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టమైన సందేశం వెళ్లిందని 

పరిస్థితులను గమనించిన  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెల్త్ సెక్రటరీ, జీఏడీ అధికారుల ద్వారా రాష్ట్ర జేఏసీ పదాధికారులను చర్చలకు ఆహ్వానించి, ఉద్యమానికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిందని నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 18వ తేదీ తర్వాత రాష్ట్ర జేఏసీ ప్రకటించే తదుపరి కార్యాచరణకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కోరారు.

అయితే ఈ సహనాన్ని చేతగాని తనంగా భావిస్తే, భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.పరిస్థితులకు పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్మా, రాజద్రోహం వంటి కఠిన పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయని చరిత్ర మాది అన్నారు.  ఉద్యమం ఆగలేదని స్పష్టం చేశారు. టీఎన్జీవోల జిల్లా సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, పెన్షనర్ల సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు 18వ తేదీ వరకు సహనంతో ఐక్యంగా సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.


మరిన్ని వార్తలు