విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు పంపిణీ చేసిన చెరుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
22-09-2026 | 08:48pm
చేగుంట సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ, అధ్యక్షతన, సర్పంచ్ తాలూకా సాయిబాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, 150 విద్యార్థిని, విద్యార్థులకు, గ్రామ నివాసి అయ్యంగళ్ల సత్యనారాయణ తన సొంత నిధులతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లను చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Cheruku Srinivas Reddy) చేతుల మీదుగా పంపిణీ చేశారు. తదనంతరం విజయసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా అయ్యంగల్ల సత్యనారాయణ ఆయన సేవా కార్యక్రమాల నిర్వాహకులను అభినందించారు.