6 March, 2026 | 10:58 AM

వినోదాత్మకంగా చెష్మా రాజా సెల్ఫీరాణి

06-03-2026 12:00 AM

రవీంద్రబాబు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘చెష్మా రాజా సెల్ఫీ రాణి’. కామెడీ, యాక్షన్, సస్పెన్స్ సమ్మిళితంగా ఈ సినిమాను తమిళ దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. రాగిణి క్రియేషన్స్ పతాకంపై పీ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముంబై ముద్దుగుమ్మ సంచిత కథానాయికగా నటిస్తుండగా.. గౌతమ్‌రాజు, రామ్ అవధాన శాస్త్రి, జబర్దస్త్ రాజమౌళి, సుష్మా సింగ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ముంబైకి చెందిన లక్ష్మిపై చిత్రీకరించిన ఒక ప్రత్యేక శృంగార భరితమైన పాట హైలైట్‌గా ఉంటుందని నిర్మాత తెలిపారు. మార్చి 6న విడుదల కానున్న ఈ సినిమాకు మాటలు-: రామ్ అవధానశాస్త్రి; సంగీతం: ఘనశ్యామ్; సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: గౌతమ్.