చెస్ టోర్నమెంట్ సీజన్-2 ఘనంగా ముగింపు

20-09-2026 | 07:13pm

యోగి గణేష్ ఆధ్వర్యంలో పోటీలు విజేతలకు ఘనంగా బహుమతుల ప్రదానం

కంగ్టి, సెప్టెంబర్ 20( విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కంగ్టి గ్రామంలో యోగి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నమెంట్ (Chess tournament) సీజన్-2 ఘనంగాముగిసింది.రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొని, ఉత్సాహంగా పోటీపడ్డారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

1.ప్రథమ బహుమతి ఎర్లగడ్డసాయికిరణ్, 2.ద్వితీయబహుమతి నిహారిక చల్ల, 3.తృతీయ బహుమతి హేమంత్,నవరాత్రి వేడుకల్లో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు గ్రామస్థులు పేర్కొన్నారు.యోగి గణేష్ అసోసియేషన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో యోగి గణేష్ అసోసియేషన్ ప్రతినిధులు,గ్రామ పెద్దలు,క్రీడాకారులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు