సబ్సిడీపై శనగ విత్తనాలు

03-10-2026 | 04:29pm

బెజ్జంకి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): యాసంగి–2026 సీజన్‌కు(Yasangi 2026 Season) రైతులకు(Farmers) సబ్సిడీపై శనగ విత్తనాలను(Bengal gram seeds) అందుబాటులోకి తెచ్చినట్లు బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి సంతోష్(Bejjanki Mandal Agriculture Officer Santosh) తెలిపారు. జాతీయ ఆహార భద్రత(National Food Security) మరియు పోషణ మిషన్‌లో(Nutrition Mission) భాగంగా సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ(Siddipet District Agriculture Department) ఆధ్వర్యంలో మండలానికి 93 బస్తాల శనగ విత్తనాలు కేటాయించినట్లు పేర్కొన్నారు.

నంద్యాల గ్రామ్ (NBeG-452) రకం శనగ విత్తనాలు 16 కిలోల ప్యాకెట్‌లో లభిస్తాయని తెలిపారు. ఒక ప్యాకెట్ పూర్తి ధర రూ.1,392 కాగా, సబ్సిడీ అనంతరం రైతు చెల్లించాల్సిన ధర రూ.432 మాత్రమేనని వివరించారు.

శనగ సాగు చేయదలిచిన రైతులు భూమి పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని సోమవారం నుంచి తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏ ఈ ఓ)ను సంప్రదించి విత్తనాలు పొందాలని వ్యవసాయ అధికారి సూచించారు. అర్హత కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు