జవాన్ కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి
- కథువాలో ఘటన, జవాన్ అరెస్ట్
- కాల్పులపై పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశం
శ్రీనగర్, సెప్టెంబర్ 29: జమ్మూకశ్మీర్‌లోని(Jammu and Kashmir) కథువాలో సీఐఎస్‌ఎఫ్ జవాన్(CISF jawan) సహచరులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. మృతుల్లో ఒక అసిస్టెంట్ కమాండెంట్(Assistant Commandant) ఉన్నారు. ఉన్నతాధికారులు మంగళవారం అందించిన వివరాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని బసోహ్లీ జిల్లాలో మష్కా గ్రామంలో ఉన్న సేవా విద్యుత్ ప్రాజెక్ట్ భద్రత(Service electricity project safety) కోసం కొందరు సైనికులను మోహరించారు. దీంతో ఇద్దరు సైనికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో ఒక జవాన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. నిందితుడైన సైనికుడిని కథువా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. రాత్రి 7.10 గంటలకు కాల్పుల ఘటన చోటు చేసుకుందని పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు.