14 April, 2026 | 2:03 PM

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి

14-04-2026 11:46 AM

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని ముఖ్యమంత్రి కొనియాడారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. B.R. Ambedkar) చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.