27 August, 2026 | 9:43 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి

27-08-2026 06:12 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండల కేంద్రానికి చెందిన మాజీ కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అహ్మద్ అలీ కుమారుడు అర్షద్ అలీ వివాహం ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం నూతన వధూవరులను పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు కలిసి అభినందిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం అహ్మద్ అలీ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి, వారి భవిష్యత్ జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. మంత్రి తమ ఇంటికి రావడంతో అహ్మద్ అలీ కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మంత్రి కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. నూతన వధూవరుల వివాహ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అర్షద్ అలీ వివాహ వేడుకకు హాజరైన బంధువులు, స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వధూవరుల జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.