23 May, 2026 | 12:11 PM

యాదాద్రీశుడి సేవలో సీఎం రేవంత్ రెడ్డి

23-05-2026 11:01 AM

యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించారు. రూ.43.80 కోట్లతో నిర్మిస్తున్న వేదపాఠశాల నిర్మాణానికి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. భూమిపూజలో కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో 15 ఎకరాల్లో వేదపాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామిని(Sri Laxmi Narasimha Swamy Temple) దర్శించుకున్నారు.

అనంతరం యాదగిరిగుట్టపై రూ. 99.55 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కొండపైన కళ్యాణ మండపం, ప్రధానాలయం వాయవ్య దిశలో మెట్లమార్గం, దీక్షాపరుల భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం యాదాద్రి పర్యటనలో(CM Revanth Reddy Yadadri Tour) శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.