కోడిపందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలం(Bejjur Mandal)లోని కోర్తే గూడెం గ్రామ శివారులో కోడి పందేలు(Cockfightings) నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. బెజ్జూర్ పోలీస్ స్టేషన్(Bejjur Police Station)కు చెందిన హెచ్సీ-1787 ఎస్.సమ్మయ్య, పీసీ-3925తో కలిసి దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహిస్తూ, నగదు పందేలు కాస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి 3 కోళ్లు, 2 కత్తులు రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడి పందేలు, జూదం ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుంది. ఇకపై ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.