ఎల్లారెడ్డి పీఎస్‌లో షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

09-09-2026 | 05:10am

ఎమ్మెల్యే శంకరయ్య వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్ నేతలు 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): రాష్ట్రంలో రానురాను ప్రభుత్వం తీరు మితిమీరిపోతుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మం త్రుల మాటతీరు మితిమీరిపోతున్నాయని హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైనది కాదని భరాసా శ్రేణు లు తీవ్రగ్రహం వ్యక్తం చేశారు. మంగళవా రం షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య బారాస అధినేత కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన చావు కోరుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచే టు అని వారన్నారు .

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేష న్లో  షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బారాస పట్టణ అధ్యక్షులు సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన కెసిఆర్ చావు కోరడం పద్ధతి కాదన్నారు. దీనివలన కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాక్యాలు చేయడం రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన అన్నారు.

కేసీఆర్ గారి పై చేసిన వ్యాఖ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నర్సింలు శ్రవణ్ సాయిలు బబ్లు నాగం రాజయ్య ఇమ్రాన్ బర్కత్ అజయ్ పాండు పృథ్వీరాజ్ అరవింద్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు