రైతుగుర్తింపుతో సమగ్ర సేవలు
ప్రత్యేక నమోదు కార్యక్రమం
మహబూబాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రైతుల*Farmers(కు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు(Government Agricultural Schemes), సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అగ్రిస్టాక్ కార్యక్రమం(Telangana Government AgriStack Program)లో భాగంగా రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేకంగా రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం(Farmer Registration Program) నిర్వహిస్తున్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరుతోంది.
రైతు రిజిస్ట్రేషన్(Farmer Registration)లో కలిగే ప్రయోజనాలు
వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల వివరాలను నమోదు చేసుకోవచ్చు
* ప్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ యాప్(fertilizer sales app) ద్వారా ఎరువుల కొనుగోళ్లకు సులభతరం.
* బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందేందుకు ఉపయోగకరం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సేవలు పొందేందుకు వీలు.
* రైతు సేవలు, సబ్సిడీలు మరియు ఇతర వ్యవసాయ సేవలకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
ఎక్కడ నమోదు చేసుకోవాలి?
గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, ఇతర అవసరమైన పత్రాలతో హాజరై రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ముఖ్య గమనిక
రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం రైతులకు గుర్తింపు నంబర్ కేటాయించబడుతుంది. ఈ ఫార్మర్ ఐడి భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ వ్యవసాయ సేవలను పొందేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. రైతులందరూ సెప్టెంబర్ 22 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేసుకో వాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
ప్రతి రైతు నమోదు చేసుకోవాలి
ప్రతి రైతు వ్యవసాయ శాఖ ద్వారా తమ గుర్తింపు కోసం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. భవిష్యత్తులో వ్యవసాయ శాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వ్యవసాయ రంగానికి అమలు చేసే ప్రతి కార్యక్రమంలో రైతు గుర్తింపు నంబర్ కీలకం. ఆధార్ కార్డు తరహాలో రైతులు ఈ అంశాన్ని అత్యంత ప్రాముఖ్యతగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా రాయితీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, సాగు పెట్టుబడి, రైతు బీమా తదితర పథకాలను వర్తింప చేయడానికి రైతు గుర్తింపు నంబర్ ద్వారా జరుగుతుంది.
- విజయచంద్ర,
డీఏఓ, మహబూబాబాద్