29 July, 2026 | 11:13 AM

Breaking News

పెరిగిన రూపాయి విలువ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు   •   లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా   •   రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన పెద్ద ప్రమాదం   •   ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ   •   గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు   •   మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్   •   నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి   •   పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి   •   సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్   •   బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ   •  

దిలావర్​పూర్​ ఇథనాల్ కంపెనీ వివరాలు బయటపెట్టిన ప్రభుత్వం

29-11-2024 01:34 PM

హైదరాబాద్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణశాఖ అనుమతులను ఉల్లంఘించి నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ కు మాత్రమే అనుమతి ఇచ్చిందని, కేంద్రం అనుమతులను గత ప్రభుత్వం పట్టించుకుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది. ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటన్ ఆల్కహాల్ ఉత్పత్తులకు, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ కు గత మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుకూలంగా అనుమతులు ఇచ్చారు. మినహయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించిందని విమర్శించారు. గత మంత్రివర్గంలో కంపెనీకి అనుకూలంగా అనుమతులు ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల ఎన్ వోసీ తీసుకోవాలి.. స్థానిక సంస్థల అనుమతులు లేకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించిందని ప్రభుత్వం తెలిపింది. 2022 అక్టోబర్ 22న గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం ఎల్ వోఐ జారీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.