29 July, 2026 | 10:48 AM

బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ

29-07-2026 09:50 AM

రికార్డుల పరిశీలన.. అభివృద్ధి పనులపై ఆరా

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) బి.అనూష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

అభివృద్ధి పనుల పురోగతి, నిధుల వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శి సంపత్ శ్రీనివాస్‌ను పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని డీపీవో సూచించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.తనిఖీ సందర్భంగా సర్పంచ్ మందా నాగరాజు, ఉపసర్పంచ్ గుండె వెంకన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.