23 June, 2026 | 11:20 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

పుదీనాతో చల్లదనం!

06-04-2025 12:00 AM

* మజ్జిగ, సలాడ్లు, వంటకాల్లో పుదీనాని ఎక్కువగా వాడతారు. దీనివల్ల వేసవిలో చలువ చేస్తుందంటున్నారు వైద్యులు.

* ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది పుదీనా. మజ్జిగలో కలిపి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, దాహాన్ని తీరుస్తుంది. 

* వికారం, కడుపుబ్బరం, జీర్ణ సమస్యలను పుదీనా నివారిస్తుంది. దీంట్లో ఉండే డైజెస్టివ్ ఎంజైములు ఆహారం వేగంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.

* వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీన్ని అదుపు చేసేందుకు లస్సీ, చెరుకు రసంలో, షర్బత్‌లో పుదీనాని కలపొచ్చు. దీంట్లో ఉండే ఎలక్ట్రోలైట్లు తక్షణ శక్తినందిస్తాయి. 

* పుదీనాలో ఉండే అరోమా భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని కూరల్లో వేసి ఉడికించడం కంటే డ్రింకుల్లోనూ, సలాడ్ల ద్వారా తినడమే ఉత్తమం. 

* పుదీనా వాసన రిఫ్రెష్ చేస్తుంది. రక్తంలో కార్టిసాల్ స్థాయులను తగ్గిస్తుంది. తరచూ తీసుకుంటే ఒత్తిడిని నివారించేందుకు తోడ్పడుతుంది. 

* చర్మానికి రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. చర్మానికి సరిపడా తేమనందిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడం, కాంతివంతంగా చేసేందుకు సాయపడుతుంది. 

* పుదీనాలో మెంతాల్ స్థాయి ఎక్కువ. ఇది జలుబు, దగ్గును నివారించేందుకు తోడ్పడుతుంది. 

* అధిక రక్తపోటుకు కారణమయ్యే ధమనుల పూడికను అదుపులోకి తెస్తుంది. దీంతో గుండెకి వేగంగా రక్తం అందుతుంది. తద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది.